Menu Toggle

 

భౌగోళిక శాస్త్రం మరియు విపత్తు నిర్వహణను ఎలా అధ్యయనం చేయాలి?

ఏదైనా పోటీ పరీక్షలో అధిక మార్కులు సాధించడానికి భూగోళశాస్త్రం, పర్యావరణం మరియు విపత్తు నిర్వహణ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ముందుగా, ఫిజికల్ జియోగ్రఫీ చదవడం పూర్తి చేయండి. తర్వాత హ్యూమన్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ చదవండి. అన్ని జనాభా సంబంధ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి తాజా సెన్సస్ నివేదిక మీద పట్టు సాధించండి.

డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పటికే ఫిజికల్ జియోగ్రఫీలో భాగంగా కవర్ చేయబడింది. అయితే, రాష్ట్రంలో లేదా దేశంలో ఇటీవల జరిగిన విపత్తులపై దృష్టి పెట్టండి. అలాగే, విపత్తు నిర్వహణపై యోజన మ్యాగజైన్ యొక్క ప్రత్యేక సంచికను పొందండి. ఇది మీకు సబ్జెక్ట్‌పై పూర్తి అవగాహనను ఇస్తుంది.

పుస్తకాలు మరియు వనరులు

  • భౌతిక భూగోళ శాస్త్రం – తెలుగు అకాడమీ ( B.A / B.Sc. Physical Geography by Telugu Akademi)
  • సాంఘిక మరియు ఆర్థిక భూగోళ శాస్త్రం – తెలుగు అకాడమీ (B.A & B.Sc Socio-Economic Geography by Telugu Akademi)
  • ప్రపంచ భూగోళ శాస్త్రం – తెలుగు అకాడమీ (B.A / B.Sc. World Geogeaphy by Telugu Akademi)
  • భారతదేశ ప్రాంతీయ భూగోళ శాస్త్రం – తెలుగు అకాడమీ (BA Regional Geography Of India by Telugu Akademi)
  • తాజా జనాభా గణన నివేదిక

Go to top.